Published on Dec 7, 2024
Government Jobs
ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో వివిధ పోస్టులు
ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో వివిధ పోస్టులు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) గ్రూప్‌-బి, గ్రూ-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23

వివరాలు:

1. జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌)- 01 పోస్టు

2. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2: 20 పోస్టులు

3. ఎలక్ట్రీషియన్‌: 02 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఐటీఐ, డిగ్రీ, ఎండీ/ ఎంబీబీఎస్‌, ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌, ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ.44,900- 1,42,400;  స్టెనోగ్రాఫర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు రూ.25,500- రూ.81,100.

వయో పరిమితి: జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 కు 27 ఏళ్లు; ఎలక్ట్రీషియన్‌ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చిరునామా: ది డైరెక్టర్‌, ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్ఎస్‌, పి,బి.నెం.2900, బెంగళూరు.

దరఖాస్తుకు చివరి తేదీ: 04-01-2025.

Website:https://nimhans.ac.in/