Published on Nov 11, 2025
Government Jobs
ఎన్‌ఐఈపీవీడీలో లెక్చరర్‌ పోస్టులు
ఎన్‌ఐఈపీవీడీలో లెక్చరర్‌ పోస్టులు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ విజువల్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. లెక్చరర్‌: 08

2. ఇన్‌స్ట్రక్టర్‌: 03

3. కోర్‌ ఫ్యాకల్టీ ఫర్‌ సీబీఐడీ కోర్స్‌: 02

4. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఎడ్‌, డీఎడ్‌, ఎంఎడ్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు లెక్చరర్‌కు రూ.60,000; ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.45,000; సీబీఐడీ కోర్స్‌కు రూ.30,000; స్పెషల్‌ ఎడ్యుకేటర్‌కు రూ.45,000.

వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: డైరెక్టర్‌, ఎన్‌ఐఈపీవీడీ, 116, రాజ్‌పుర్‌ రోడ్‌, దెహ్రాదూన్‌ చిరునామాకు చివరి తేదీ నాటికి పంపించాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 28.11.2025.

Website:https://niepvd.nic.in/new-advertisements/