నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై కింది పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్(కన్సల్టెంట్): 04
2. లెక్చరర్(కన్సల్టెంట్): 05
3. ప్రొస్టెటిస్ట్, ఆర్థోటిస్ట్ & డెమాన్ స్ట్రేటర్(కన్సల్టెంట్): 06
4. క్లినికల్ అసిస్టెంట్(కన్సల్టెంట్):02
5. స్పెషల్ ఎడ్యుకేటర్(కన్సల్టెంట్):01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఆక్యుపేషనల్ థెరపి), ఎంఫిల్(క్లినికల్ సైకాలజీ), డిగ్రీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ మల్టిపుల్ డిసబిలిటీస్), మాస్టర్స్ డిగ్రీ( ప్రొస్టెటిస్ట్, ఆర్థోటిస్ట్ & డెమాన్ స్ట్రేటర్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 ఏళ్లు.
జీతం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్(కన్సల్టెంట్)కు రూ.75,000, లెక్చరర్(కన్సల్టెంట్)కు రూ.60,000, ప్రొస్టెటిస్ట్, ఆర్థోటిస్ట్ & డెమాన్ స్ట్రేటర్(కన్సల్టెంట్), క్లినికల్ అసిస్టెంట్(కన్సల్టెంట్)కు రూ.50,000, స్పెషల్ ఎడ్యుకేటర్(కన్సల్టెంట్)కు రూ.45,000.
దరఖాస్తు ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-02-2025.