సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్)లోని ఎన్‌బీఈఆర్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 13
వివరాలు:
1. సీనియర్ కన్సల్టెంట్: 02
2. కన్సల్టెంట్: 05
3. జూనియర్ కన్సల్టెంట్: 02
4. డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
5. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ కన్సల్టెంట్‌కు రూ.60,000; కన్సల్టెంట్‌కు రూ.50,000; జూనియర్ కన్సల్టెంట్‌కు రూ.40,000; డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,000; మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000.
వయోపరిమితి: డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 35 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు వయసు పరిమితి లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.200. డీడీ ద్వారా చెల్లించాలి.
ఇంటర్వ్యూ తేదీ: 17.11.2025.
వేదిక: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్.
Website:https://www.niepmd.tn.nic.in/