Published on Apr 24, 2025
Government Jobs
ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు
ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

 మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 04
2. సీనియర్‌ కన్సల్టెంట్‌: 03
3. సూపర్‌వైజర్‌: 01
4. అకౌంటెంట్‌: 01
5. రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ, పీజీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.75,000; సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.60,000; సూపర్‌వైజర్‌కు రూ.35,000; అకౌంటెంట్‌కు రూ.45,000; రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌ రూ.50,000.

వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.590; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.5.2025

Website: https://www.niepmd.tn.nic.in/

Apply online: http://https//niepmd.com/career/index.php