Published on Feb 24, 2025
Government Jobs
ఎన్‌ఐఆర్‌టీలో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులు
ఎన్‌ఐఆర్‌టీలో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులు

ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపాదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 16

వివరాలు:

అసిస్టెంట్‌: 05 

అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01 

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 10

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు ఏళ్లు మించకూడదు; అప్పర్‌ డివిజన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు 18 - 27 మధ్య ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.11,2400; అప్పర్‌ డివిజన్‌కు రూ.25,500-రూ.81,100; లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు రూ.19,900-రూ.63,200.

దరఖాస్తు ఫీజు: అన్ రిజర్వ్‌డ్‌/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ వారికి రూ.2000; ఎస్సీ/ మహిళా అభ్యర్థులకు రూ.1,600.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-3-2025

Website:https://nirt.res.in/