Published on Sep 5, 2025
Current Affairs
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025 ర్యాంకింగ్స్‌
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025 ర్యాంకింగ్స్‌

కేంద్ర విద్యాశాఖ 2025, సెప్టెంబరు 4న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌-2025 ర్యాంకులను విడుదల చేసింది. అత్యుత్తమ పనితీరుతో ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విద్యాసంస్థ వరుసగా ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం ఇది ఏడోసారి. ఓవరాల్‌ కేటగిరీలో ఐఐఎస్‌సీ బెంగళూరు ద్వితీయ స్థానంలో, ఐఐటీ బాంబే తృతీయ, ఐఐటీ దిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి.