Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 18, 2026
Government Jobs
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ పోస్టులు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సీనియర్ అనలిస్ట్‌: 25 పోస్టులు

విభాగాలు: లీగల్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌, అడ్మినిస్ట్రేషన్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, కంపెనీ సెక్రటరీ, విజిలెన్స్‌, లెండిగ్‌ ఆపరేషన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ ట్రెజరీ, ఐటీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఏ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి. 

వయోపరిమితి: 21 ఏళ్ల నుంచి 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఏప్రిల్‌ 8.

Website:https://nabfid.org/careers