నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం), సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ (సీపీఎంయూ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 20
వివరాలు:
1. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ - 01
2. డొమైన్ ఎక్స్‌పర్ట్ - పబ్లిక్ హెల్త్ - 08
3. సీనియర్ కన్సల్టెంట్ -2
4. జూనియర్ కన్సల్టెంట్ - 04
5. ఫైనాన్స్ మేనేజర్ - 01
6. అకౌంట్స్ మేనేజర్ - 01
7. డేటా అసిస్టెంట్ - 03
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్/బీయూఎంఎస్/బీహెచ్‌ఎంఎస్/బీఎస్ఎంఎస్/బీవైఎన్‌ఎస్/ఎంబీఏ/ఎంకామ్/ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000- రూ.1,00,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, రూమ్ నెం. 402-బి, ఆయుష్ భవన్, బి-బ్లాక్, జిపిఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, దిల్లీ -110023.
దరఖాస్తు చివరి తేదీ: 27-02-2026.
Website:https://ayush.gov.in/#!/careers