Published on Jun 13, 2025
Government Jobs
ఎన్‌ఏఎస్‌ఐలో అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు
ఎన్‌ఏఎస్‌ఐలో అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ) డెరెక్ట్‌/ డిప్యూటేషన్‌ ప్రాతిపదికన రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు:

1. అకౌంట్స్‌ ఆఫీసర్‌: 01

2. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: 01

3. కంప్యూటర్‌ ఆపరేటర్‌: 01

4. స్టెనో-టైపిస్ట్‌: 01

5. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (యూడీసీ): 02

6. మల్టీ- టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్‌, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ  ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టెపింగ్‌ స్కిల్స్‌, పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అకౌంట్‌ ఆఫీసర్‌కు రూ.53,100-రూ.1,67,800; కంప్యూటర్‌ ప్రొగ్రామర్‌కు రూ. 35,400- రూ.1,12,400, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు రూ.35,400- రూ.1,12,400, ఇతర పోస్టులకు రూ.25,500- రూ.81,100. 

వయో పరిమితి: అకౌంట్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు; కంప్యూటర్‌ ప్రొగ్రామర్‌కు 30ఏళ్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు 56ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 18-27  మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా.

చిరునామా: ది జనరల్‌ సెక్రటరీ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా, లజపతిరాయ్‌ రోడ్‌, ప్రయాగ్‌రాజ్‌ చిరునామకు జూన్‌ 28వ తేదీ లోగా పంపించాలి.

ఈమెయిల్:es@nasi.ac.in,  

దరఖాస్తు చివరి తేదీ: 28-06-2025.

Website:https://nasi.org.in/job-openings/