Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 9, 2026
Government Jobs
ఎన్ఎస్‌ఐఎల్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు
ఎన్ఎస్‌ఐఎల్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

బెంగళూరులోని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

1. కన్సల్టెంట్‌ (ఫైనాన్స్‌): 02

2. యంగ్‌ కన్సల్టెంట్‌- గ్రౌండ్‌ సెగ్మెంట్‌: 02

3. కన్సల్టెంట్‌ (హెచ్‌ఆర్‌): 02

4. కన్సల్టెంట్‌ (పర్చెస్‌ అండ్‌ స్టోర్‌): 02

5. యంగ్‌ కన్సల్టెంట్‌- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 01

6. యంగ్‌ కన్సల్టెంట్‌- మెకానికల్‌: 01

7. కన్సల్టెంట్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.40,000- రూ.1,40,000; కన్సల్టెంట్‌కు రూ.50,000- రూ.1,60,000; సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.80,000- రూ.2,20,000.

వయోపరిమితి: కన్సల్టెంట్‌కు 35 ఏళ్లు; సీనియర్ కన్సల్టెంట్‌కు 45 ఏళ్లు; యంగ్‌ కన్సల్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.590 (+జీఎస్‌టీ); మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 31.01.2026.

Website:https://www.nsilindia.co.in/career