జాతీయ భద్రత సలహా బోర్డు (ఎన్‌ఎస్‌ఏబీ) ఛైర్మన్‌గా భారత నిఘా విభాగం ‘రా’ మాజీ అధిపతి ఆలోక్ జోషిని కేంద్రం 2025, ఏప్రిల్ 30న నియమించింది. జాతీయ భద్రత మండలి సచివాలయానికి సలహా బోర్డుగా.. 15 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఎస్‌ఏబీ పనిచేస్తుంది. ఇందులో కొత్త సభ్యులుగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పి.ఎం.సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎ.కె.సింగ్, రియర్ అడ్మిరల్ (విశ్రాంత) మోంటీ ఖన్నా, మాజీ దౌత్యవేత్త బి.వెంకటేశ్ వర్మ, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్ తాజాగా నియమితులయ్యారు.