నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వద్ద నమోదైన మొత్తం క్లయింట్ల ఖాతాల సంఖ్య 20 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ఆ సంస్థ 2024, అక్టోబరు 30న వెల్లడించింది. డిజిటలీకరణ, సాంకేతికత మార్పులు ఇందుకు ఉపకరించాయని పేర్కొంది. 2024 మార్చిలో క్లయింట్ల సంఖ్య 16.90 కోట్లుగా ఉంది.
క్లయింట్ల ఖాతాల్లో తొలి 10 రాష్ట్రాలు:
1. మహారాష్ట్ర: 3.6 కోట్లు, 2. ఉత్తర్ ప్రదేశ్: 2.18 కోట్లు, 3. గుజరాత్: 1.81 కోట్లు, 4. రాజస్థాన్: 1.17 కోట్లు, 5. పశ్చిమ్ బెంగాల్: 1.16 కోట్లు 6. కర్ణాటక: 1.07 కోట్లు, 7. మధ్య ప్రదేశ్: 1.04 కోట్లు, 8. తమిళనాడు: 1.01 కోట్లు, 9. దిల్లీ: 90.79 లక్షలు, 10. ఆంధ్రప్రదేశ్: 89.69 లక్షలు