ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ స్టీల్ లిమిటెడ్ అధిపతిగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ 2025, ఫిబ్రవరి 26న బాధ్యతలు చేపట్టారు.
ఎన్‌ఎండీసీ నుంచి విడిపోయిన ఈ సంస్థకు ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో అత్యాధునిక స్టీలు కర్మాగారం ఉంది. ప్రస్తుతం 30 లక్షల టన్నుల హాట్ మెటల్‌ను ఈ కర్మాగారం ఉత్పత్తి చేస్తోంది.
ప్రభాకర్, గతంలో సెయిల్‌కు చెందిన రూర్కెలా స్టీలు ప్లాంట్‌లో సీజీఎంగా పనిచేశారు. అక్కడి నుంచి ఎన్‌ఎండీసీ స్టీలుకు వచ్చారు.