Published on Mar 4, 2025
Current Affairs
ఎన్‌ఎండీసీ స్టీలుకు ఐరోపా సమాఖ్య నాణ్యతా గుర్తింపు
ఎన్‌ఎండీసీ స్టీలుకు ఐరోపా సమాఖ్య నాణ్యతా గుర్తింపు

ఎన్‌ఎండీసీ స్టీలు లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక సీఈ (కన్‌ఫర్మిటీ యూరోపీన్నే) సర్టిఫికెట్‌ లభించింది. ఐరోపా సమాఖ్య నోటిఫైడ్‌ సర్టిఫికేషన్‌ సంస్థ ‘టీయూవీ నార్డ్‌’ నిర్దేశించిన సీపీఆర్‌ (కన్‌స్ట్రక్షన్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేషన్‌) ప్రకారం ఉత్పత్తుల శ్రేణి సాధించినందుకు ఈ సర్టిఫికెట్‌ మంజూరు చేశారు. దీనివల్ల ఎన్‌ఎండీసీ స్టీలు ఉత్పత్తులు ఐరోపా నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్నట్లు ధ్రువీకరించినట్లు అవుతోంది. 
* ఐరోపా దేశాలకు స్టీలు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు, ఐరోపా దేశాలకు స్టీలు ఓఈఎం (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్‌) ఉత్పత్తులు అందించడానికి ఈ సర్టిఫికెట్‌ అవసరం. ఎన్‌ఎండీసీ స్టీలు ఉత్పత్తులతో ఇతర సంస్థలు ఓఈఎం విడిభాగాలు ఆవిష్కరించి, ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది.