ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం 2025 మార్చి 1న నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆమె ఎన్‌ఎండీసీ కార్పొరేట్ కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
ఎన్‌ఎండీసీలో ప్రియదర్శిని 1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరారు. అదే సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
అంతేకాక ఒక మైనింగ్ సంస్థలో ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.