Published on Oct 22, 2024
Government Jobs
ఎన్‌ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు
ఎన్‌ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం, మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 153

వివ‌రాలు:

విభాగాల వారీగా: కమర్షియల్-04; ఎన్విరాన్‌మెంట్-01; జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03; మైనింగ్‌- 56; సర్వే-09; కెమికల్- 04; సివిల్-09; ఎలక్ర్టికల్‌-44; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03; మెకానికల్- 20.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ,  పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.37,000-రూ.1,30,000.

దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 10-11-2024.

Website:https://www.nmdc.co.in/