ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ గనుల కంపెనీగా ఎన్‌ఎండీసీ చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకుంది. ఎన్‌ఎండీసీ 2.0 చొరవ, అమలు తీరుతో ఇది సాధ్యమైందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ పేర్కొన్నారు.
1978లో 10 మి.టన్నులు, 2015లో 30 మి.టన్నుల గరిష్ఠ ఉత్పత్తిని ఎన్‌ఎండీసీ నమోదు చేసింది.