దిల్లీలోని నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీఎఫ్‌సీ) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్(కంపెనీ సెక్రటరీ): 01
2. అసిస్టెంట్ మేనేజర్(ప్రాజెక్ట్ లీగల్ & రికవరీ): 02
3. అసిస్టెంట్ మేనేజర్( ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 01
4. అసిస్టెంట్య మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం అండ్ అడ్మిన్): 01
5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జనవరి 31వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.95,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.30,000 - రూ.1,20,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 24.
Website:https://nmdfc.org/recruitment