షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఎల్) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: 30
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 - రూ.1,60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ 560; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 17.