 
        
      నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఎల్) 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 98
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 46
2. డిప్లొమా అప్రెంటిస్: 26
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(జనరల్ స్ట్రీమ్): 18
4. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 08
విభాగాలు: ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైన్‌మెన్, ఎలక్ట్రికల్, మెకానికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 18 - 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(బీటెక్)కు రూ.18,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(జనరల్ స్ట్రీమ్), డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.15,000, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.14,877.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 8.
Website:https://neepco.co.in/hi