సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ జోనల్ సెంటర్- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 03
అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెటల్ మేనేజ్‌మెంట్/ ఎన్విరాన్మెంటల్ సైన్స్/ మైక్రోబయాలజీ/ బొటనీ, జూవాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ: 11-04-2025.