Published on Sep 28, 2024
Apprenticeship
ఎన్ఆర్‌సీబీలో అప్రెంటిస్‌ ఖాళీలు
ఎన్ఆర్‌సీబీలో అప్రెంటిస్‌ ఖాళీలు

ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్‌)కు చెందిన తమిళనాడు, తిరుచిరాపల్లిలోని నేషనల్‌ రిసెర్చ్ సెంటర్ ఫర్ బనానా (ఎన్ఆర్‌సీబీ) అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 05

2. టెక్నీషియన్ అప్రెంటిస్‌: 06

విభాగాలు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9,000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 07-10-2024

Website:https://nrcb.icar.gov.in/