ఇస్రోకి చెందిన హైదరాబాద్‌లోపి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 13
వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) - 01
2.టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్) -01
3. టెక్నీషియన్-'బి' (ఎలక్ట్రానిక్ మెకానిక్) - 05
4. టెక్నీషియన్-'బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) -04
5. టెక్నీషియన్-'బి (ఎలక్ట్రికల్) - 01
6. టెక్నీషియన్-'బి (సివిల్) -01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75 శాతం మార్కులతో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ/డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 30.11.2025 నాటికి 18-35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్)కు రూ.44,900 -రూ.1,42,400. టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్)కు రూ.44,900 - రూ.1,42,400. టెక్నీషియన్-'బి' (ఎలక్ట్రానిక్ మెకానిక్)కు రూ.21,700 - రూ.69,100. టెక్నీషియన్-'బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కు రూ.21,700 - రూ.69,100. టెక్నీషియన్-'బి (ఎలక్ట్రికల్)కు రూ.21,700 - రూ.69,100. టెక్నీషియన్-'బి (సివిల్) కు రూ.21,700 - రూ.69,100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబరు 30.
Website:https://www.nrsc.gov.in/nrscnew/Career_ApplyOnline.php