Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
న్యూదిల్లీలోని ఎడ్‌సిల్ (ఇండియా) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 257
వివరాలు:
1. కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్: 255 పోస్టులు
2. పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్: 2 పోస్టులు
అర్హత: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఏ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఫిల్ (సైకియాట్రిక్ సోషల్ వర్క్/ మాస్టర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. తెలుగు భాషా ప్రావీణ్యం తప్పనిసరి.
వేతనం: నెలకు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు రూ.30,000. పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్ పోస్టులకు రూ.50,000.
గరిష్ఠ వయోపరిమితి: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు 35 ఏళ్లు; పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్లకు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్/ ప్రొఫెషనల్ విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత నైపుణ్య పరీక్ష, పీపీటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పని ప్రదేశం: కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో; పీఎంయూ మెంబర్స్/ కోఆర్డినేటర్ పోస్టులు విజయవాడలో భర్తీ కానున్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-12-2024.