దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ముందు ఎడెల్‌మన్ ట్రస్ట్ బారో మీటర్ వార్షిక ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది.
ఇందులో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇండోనేసియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ మూడో స్థానానికి పరిమితమైంది.
ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, స్వచ్ఛందసంస్థలపై ప్రజల విశ్వాసం ఆధారంగా ఈ ర్యాంకులు రూపొందించారు.
2024లో భారత్ రెండో స్థానంలో ఉంది.