2023-24 ఆర్థిక సంవత్సరంలో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులైన శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది.
2022-23 కంటే 5% అధికంగా శివ నాడార్ కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్లు దానం చేసినట్లు ‘ఎడెల్గివ్- హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా- 2024’ వెల్లడించింది.
నాడార్ తర్వాతి స్థానాల్లో ముకేశ్ అంబానీ, బజాజ్ కుటుంబం, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదానీ కుటుంబం ఉన్నాయి.