Published on Nov 21, 2025
Admissions
ఎండీఐలో పీజీడీఎం 2026 ప్రవేశాలు
ఎండీఐలో పీజీడీఎం 2026 ప్రవేశాలు

గురుగ్రామ్‌, ముషీరాబాద్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ) 2026-28 సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం)

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం)

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (పీజీడీఎం-ఐబీ)

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (బిజినెస్‌ అనలిటిక్స్‌)

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌ 2025) స్కోర్‌ తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు: ఎండీఐ గుడ్‌గావ్‌కు రూ.3000; ఎండీఐ ముషీరాబాద్‌కు రూ.1770; రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి రూ.3,590.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-11-2025.

Admissions:https://admissions.mdi.ac.in/?utm_source=MDIG&utm_medium=banner&utm_campaign=PGY&gad_source=1

Website:https://mdi.ac.in/