ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎస్‌ఎల్) 2025 అప్రెంటిస్ బ్యాచ్‌కు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, కార్పెంటర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ తదితర ట్రేడుల్లో ట్రేడ్ అప్రెంటిస్(గ్రూప్-ఎ, బి, సి) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 523
వివరాలు:
ట్రేడ్‌లు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఐసీటీఎస్‌ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్‌ఏసీ, వెల్డర్, సీఓపీఏ, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్).
అర్హత: ఖాళీని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-10-2025 నాటికి గ్రూప్ ఎ- 15-19 ఏళ్లు; గ్రూప్ బి- 16-21 ఏళ్లు. గ్రూప్ సి- 14-18 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, ఠాణే, పుణె, చత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్), నాగ్‌పుర్, కొల్హాపుర్, నాసిక్.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2025.
హాల్‌టికెట్ల జారీ: 18-07-2025.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 02-08-2025.
Website:http://https//www.mazagondock.in/
Apply online:https://mazagondock.in/app/mdlapprentice/Login.aspx