ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎస్‌ఎల్) 2025-26 సంవత్సరానికి ఏడాది అప్రెంటిస్ ట్రైనింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200
వివరాలు:
ఇంజినీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 110 ఖాళీలు
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 60
డిప్లొమా అప్రెంటిస్: 30 ఖాళీలు
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ, నేవల్ అర్కిటెక్చర్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్.
అర్హత: ఖాళీని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, జనరల్ డిగ్రీ. 01 ఏప్రిల్ 2021 లేదా ఆ తరువాత ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన లేదా కొనసాగిస్తున్న అభ్యర్థులు అర్హులు కారు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900.
వయోపరిమితి: 01-03-2026 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఎండీఎల్ అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఎన్‌ఏటీ 2.0 పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.12.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-01-2026.
ఇంటర్వ్యూ షెడ్యూల్: 16-01-2026.
ఇంటర్వ్యూలు ప్రాంరంభం: 27-01-2026.
Website:https://www.mazagondock.in/