Published on Sep 25, 2024
Government Jobs
ఎంటీపీఎఫ్‌లో టెక్నిషీయన్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో టెక్నిషీయన్ పోస్టులు

ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్‌ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్‌)కు చెందిన మహారాష్ట్ర థానే జిల్లా అంబర్‌నాథ్‌లోని మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ (ఎంటీపీఎఫ్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 81

వివ‌రాలు:

1. జూనియర్ మేనేజర్: 26

2. డిప్లొమా టెక్నీషియన్: 34

3. అసిస్టెంట్: 02

4. జూనియర్ టెక్నీషియన్: 19

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్‌ అండ్ అకౌంట్స్‌, మార్కెటింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, సీఎన్‌సీ ఆపరేటర్, టూల్‌ డిజైన్, గ్రైండర్, ఎలక్ట్రీషియన్.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.47,610; జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.34,227; మిగతా పోస్టులకు రూ.37,201.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్‌ ఎస్టేట్, అంబర్‌నాథ్‌, థానే, మహారాష్ట్ర’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024.

Website:https://avnl.co.in/