ఎంజీఐఆర్‌ఐలో ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
మహారాష్ట్ర వార్దాలోని మహాత్మ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ (ఎంజీఐఆర్‌ఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ (రూరల్ కెమికల్ ఇండస్ట్రీస్)- 01
2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ (మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్)- 01
అర్హత: కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ తదితరాల్లో ఎంబీఏ, మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్, పీజీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025.
Website: https://mgiri.org/regular-vacancy/