భారత చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్) మాజీ అధ్యక్షుడు, ప్రముఖ చరిత్రకారుడు ఎం.జి.ఎస్.నారాయణన్ (93) కేరళలోని కోళికోడ్ జిల్లా, మలపరంబలో 2025, ఏప్రిల్ 26న మరణించారు. ఆయన 1976-1990ల మధ్య కాలికట్ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగాధిపతిగా విధులు నిర్వహించారు. 2001-2003 మధ్య ఐసీహెచ్‌ఆర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.