ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
వివరాలు:
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ- డిజిటల్ టెక్నాలజీ: 10
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ- రిసెర్చ్ అండ్ అనాలసిస్- 05
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ- రాజ్‌భాష: 02
4. మేనేజ్‌మెంట్ ట్రైనీ- లీగల్: 05
5. డిప్యూటీ మేనేజర్- లీగల్: 04
6. డిప్యూటీ మేనేజర్: 01
7. చీఫ్ మేనేజర్: 01
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్. ఎంసీఏ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 28.02.2025 నాటికి ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు; ఓబీసీ వారికి 31 నుంచి 33; ఈడబ్ల్యూఎస్/ యూఆర్ అభ్యర్థులకు 28 నుంచి 40 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.65,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,480 నుంచి రూ.85,920; చీఫ్ మేనేజర్‌కు రూ.85,920 నుంచి 1,05,280.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-03-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15-04-2025.
రాత పరీక్ష తేదీ: మే 2025.
Website:https://www.eximbankindia.in/