నాగ్‌పూర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 67
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ ట్రెయినీ: 49
2. మేనేజ్‌మెంట్ ట్రెయినీ: 15
3. మేనేజర్: 03
విభాగాలు: మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, జియాలజీ, ప్రాసెస్, మెటీరియల్, సిస్టం, పర్సనల్, మార్కెటింగ్, సర్వే.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 20వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు మెనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000, మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20.