Published on Mar 2, 2025
Government Jobs
ఎంఓఇఎఫ్‌సీసీలో సైంటిస్ట్ పోస్టులు
ఎంఓఇఎఫ్‌సీసీలో సైంటిస్ట్ పోస్టులు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఇఎఫ్‌సీసీ), దిల్లీ సైంటిస్ట్‌(బి/సి/డి/జి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సైంటిస్ట్‌ బి, సి పోస్టులకు 35 ఏళ్లు, సైంటిస్ట్‌ డి పోస్టుకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌ జి పోస్టుకు 50 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు సైంటిస్ట్ బి పోస్టుకు రూ.56,100 - రూ.1,77,500, సైంటిస్ట్‌ సి పోస్టుకు రూ.67,700 - రూ.2,08,700, సైంటిస్ట్‌ డి పోస్టుకు రూ.78,800 - రూ.2,09,200, సైంటిస్ట్‌ జి పోస్టుకు

రూ.1,44,200 - రూ.2,18,200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-03-2025.

Website: https://moef.gov.in/