ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధిపతి (ప్రొవోస్ట్)గా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అనంత చంద్రకాశన్ నియమితులయ్యారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాలయ నేతృత్వ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ అమెరికన్ ఆయనే. 2025, జులై 1న ఆయన నూతన పదవీ బాధ్యతలు చేపడతారు.
ఎంఐటీకి ప్రొవోస్ట్‌గా ఎన్నికైన వ్యక్తి సంస్థ విద్యావిషయాలకు బాధ్యునిగా ఉండటంతోపాటు ఆర్థికాంశాలనూ పర్యవేక్షిస్తారు.