విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం టెక్నాలజీ సెంటర్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు
2. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్- 60 సీట్లు
వ్యవధి: మూడేళ్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 22 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెరిట్‌జాబితా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.500; ఎస్సీ/ ఎస్టీలకు రూ.250.
ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష ఆఫ్‌లైన్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఏయూ క్యాంపస్, విశాఖపట్నం, ఎంఎంఎంఈ టెక్నాలజీ సెంటర్, అచ్చుతాపురం, అనకాపల్లి, విజయవాడ.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06-05-2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 11-05-2025.
ఫలితాలు: 19.05.2025.
కోర్సు ప్రారంభం: 16.06.2025.
Website:https://www.msmetcvizag.org/
Apply online:https://www.msmetcvizag.org/online-registration-form-diploma/