Published on May 21, 2025
Current Affairs
ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ కన్నుమూత
ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ కన్నుమూత

ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ (95) 2025, మే 20న ఊటీలో కన్నుమూశారు.

1930లో బెంగళూరులో జన్మించిన శ్రీనివాసన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు.

1955లో అణు విద్యుత్‌ శాఖలో చేరారు.

దేశ అణు విద్యుత్‌ రంగానికి ఆద్యుడైన డాక్టర్‌ హోమీ జహంగీర్‌ భాభాతో కలిసి పనిచేశారు.

దేశ తొలి అణు పరిశోధక రియాక్టర్‌ ‘‘అప్సర’’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 

1959లో ఆయన దేశ తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీరుగా నియమితులయ్యారు.

1967లో ఆయన మద్రాస్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌కు చీఫ్‌ ప్రాజెక్టు ఇంజినీరుగా పనిచేశారు.  

అణు రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను 2015లో పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.