ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌శామ్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది.
2025, ఏప్రిల్ 3, 4 తేదీల్లో మొత్తం నాలుగు అస్త్రాలను పరీక్షించినట్లు రక్షణశాఖ తెలిపింది.
ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి ఇందుకు వేదికైంది.
ఈ ప్రయోగాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), సైన్యం ఉమ్మడిగా నిర్వహించాయి.