Published on Nov 11, 2024
Admissions
ఉస్మానియా వర్సిటీలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రామ్
ఉస్మానియా వర్సిటీలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, కిమ్స్‌ హాస్పిటల్, అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్, ఒమేగా హాస్పిటల్, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఓయూ నిర్వహిస్తోంది.

వివరాలు:

పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్‌ రేడియోలాజికల్ ఫిజిక్స్‌

సీట్ల సంఖ్య: 8 + 8 (స్పాన్సర్డ్).

కోర్సు వ్యవధి: 2 సెమిస్టర్లు (ఒక ఏడాది) + ఏడాది ఇంటర్న్‌షిప్/ ఫీల్డ్ ట్రైనింగ్‌.

అర్హత: కనీసం 60% మార్కులతో ఎమ్మెస్సీ (ఫిజిక్స్/ న్యూక్లియర్ ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

కోర్సు ఫీజు: రూ.60,000 (స్పాన్సర్డ్ అభ్యర్థులకు రూ.1,20,000).

ఎంపిక ప్రక్రియ: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా.

ఆఫ్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 11-11-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 05-12-2024.

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 14-12-2024.

Website:https://www.osmania.ac.in/