హైదరాబాద్‌లోని ఉషోదయ పబ్లికేషన్స్, పబ్లిషర్స్ ఆఫ్ ఈనాడు మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మేనేజ్మెంట్ ట్రైనీలు
అర్హత: గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్(ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు)
వయోపరిమితి: 24-26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్-పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు బిజినెస్, ఆపరేషనల్ ఆక్టివిటీస్‌కు సంబంధించిన వివిధ రంగాల్లో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
జాబ్ లొకేషన్: శిక్షణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.25,000 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రారంభ
వేతనం రూ.28,000 అందుతుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2024.
Website:https://recruitment.myhrms.net/Ramojigroup_careers/Applyjob/MANAGEMENT-TRAINEE/1/eenadu