దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బ్రాడ్ ఫ్రంట్ కూటమి అభ్యర్థి యమండు ఓర్సీ (57) విజయం సాధించారు. 34 లక్షల జనాభా గల ఉరుగ్వేలో 27 లక్షలమంది ఓటర్లు ఉన్నారు.
ఓర్సీకి 49.8 శాతం ఓట్లు పోలవగా.. పాలక నేషనల్ పార్టీ అభ్యర్థి ఆల్వారో డెల్గాడోకు 45.9 శాతం లభించాయి.