ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిలో ఏ ఉపాధీ లేనివాళ్లు 1.56 కోట్ల మంది ఉన్నారు. ఇలాంటివారున్న మొదటి ఐదు జిల్లాల్లో కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం ఉన్నాయి. కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో ఉంది. ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వారున్నారు. సచివాలయాల ఉద్యోగులు మార్చిలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు. ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తేల్చారు.