Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 12, 2026
Current Affairs
ఉదయ్‌ నాగరాజు
ఉదయ్‌ నాగరాజు
  • శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు 2026, ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడి (లైఫ్‌ పీర్‌)గా ప్రమాణం చేశారు. బ్రిటిష్‌ సంప్రదాయాల మేరకు జరిగిన వేడుకలో ముదురు ఎరుపు రంగు గౌను ధరించి, భగవద్గీతపై ఆయన ప్రమాణం చేశారు.
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు.. దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్‌ వెళ్లారు. మహాత్మాగాంధీ ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగామ్‌ వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించడంలో కృషిచేస్తున్నారు.