ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియామకానికి 2024, డిసెంబరు 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రీతుబాహరీ అక్టోబరు 10న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో జస్టిస్ నరేందర్‌ను నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది.