తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ 2025 ఏడాదికి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఉత్తమ మహిళా ప్లేయర్‌గా నిలిచింది. ఇండియన్ ఉమెన్స్ లీగ్‌లో ఈస్ట్ బెంగాల్‌కు ఆడిన సౌమ్య.. తొమ్మిది గోల్స్ సాధించింది. ఫైనల్లో 42వ నిమిషంలో గోల్‌తో జటును గెలిపించింది. ఏఐఎఫ్‌ఎఫ్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్యనే.
పురుషుల విభాగంలో సుభాషిష్ బోస్ ‘ఉత్తమ ప్లేయర్’గా ఎంపికయ్యాడు. బోస్ నాయకత్వంలోని మోహన్‌బగాన్ జట్టు ఐఎస్‌ఎల్ కప్‌తో పాటు లీగ్ విన్నర్స్ షీల్డ్‌నూ గెలుచుకుంది. 2020-21లో ముంబయి సిటీ తర్వాత.. ఒకే సీజన్లో ఈ రెండు ట్రోఫీలు గెలిచిన ఘనత మోహన్‌బగాన్‌దే.