ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు 2026 ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 1.03 లక్షల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.85 కోట్లు ఖర్చవుతుందని వివరించారు.