కృత్రిమ మేధ విస్తృత ప్రచారం కల్పించిన ‘స్లాప్’ మాటను మరియం-వెబ్‌స్టర్ నిఘంటు సంస్థ ఈ సంవత్సరపు (2025) మేటి మాటగా గుర్తింపునిచ్చింది. జుగుప్సాకరమైన, మూర్ఖత్వంతో కూడుకున్న, తప్పుడు డిజిటల్ సమాచారాన్ని ఆన్‌లైన్ జగతిలో ‘‘స్లాప్’’ అని పిలవడం పరిపాటి అయింది. ‘ఇదో చక్కటి వర్ణణాత్మక పదం’ అని మరియం వెబ్‌స్టర్ సంస్థ అధ్యక్షుడు గ్రెగ్ బార్లో 2025, డిసెంబరు 15న వెల్లడించారు.
స్లాప్ అనే మాటను 1700 సంవత్సర ప్రాంతంలో మెత్తటి బురదను అభివర్ణించడానికి తొలుత వాడారు.