Published on Sep 20, 2025
Current Affairs
ఈసీ జాబితా నుంచి పార్టీల తొలగింపు
ఈసీ జాబితా నుంచి పార్టీల తొలగింపు

ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని 474 పార్టీలపై వేటుపడింది.

వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17, తెలంగాణ నుంచి ఎనిమిది పార్టీలు ఉన్నాయి.

ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం లాంటి కారణాలతో ఇలాంటి పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది.

ఆగస్టులో ఇలాంటి 334 పార్టీలను రద్దు చేసింది.

దీంతో ప్రక్షాళనలో భాగంగా 808 పార్టీలను రెండునెలల్లో రద్దు చేసినట్లయింది. 

ఈసీ జాబితాలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన (జాతీయ) పార్టీలు ఆరు, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందినవి 67, నమోదై.. గుర్తింపు పొందనివి 2,046 ఉన్నాయి.